నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ…

నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 14 (అఖండ భూమి న్యూస్)

జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ (ఎన్.ఎస్.పి.సి) 2025 పోస్టర్ ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్ , చందర్ తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాల వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్వాలిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తగిరంచ నరసింహారెడ్డి ఎస్ ఏ ఇంగ్లీష్ వ్రాసిన వీడియో సాంగ్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ పోటీని

*హరిత్ , ద వే ఆఫ్ లైఫ్ అనే నినాదం తో పర్యావరణ సంరక్షణ.

అనే ఉద్దేశంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయనీ, కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారనీ చెప్పారు. ఫలితాలు ఆగస్టు 30న విడుదల విడుదల చేస్తామన్నారు.

పోటీ ఐదు విభాగాలలో..

1. 1వ తరగతి నుండి 5వ తరగతి,

2. 6వ తరగతి నుండి 8వ తరగతి

3. 9వ తరగతి నుండి 12వ తరగతి

4. డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు

5. ఇతరులు / సాధారణ పౌరులు

పోటీలో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు.

ఈకో మిత్ర https://ecomitram.app/nspc/

అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

హిందీ, ఇంగ్లీష్ సహా అనేక భాషలలో క్విజ్ అందుబాటులో ఉంటుందనీ, మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న మీ సెల్ఫీని అప్లోడ్ చేయడం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి పాల్గొన్నందుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందనీ, ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ పోటీలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దారాం రెడ్డి పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!