కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …

కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31 (అఖండ భూమి న్యూస్);

కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన రేషన్ కార్డులు పొందిన అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తోంది.

 

30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.

 

ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

 

దీంతో లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనుంది. రేషన్ కార్డుల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి అన్ని ప్రభుత్వ పథకాల్లో అర్హుడు గా కొనసాగుతారు.

Akhand Bhoomi News

error: Content is protected !!