కామారెడ్డిలో మున్నూరు కాపు సంఘం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డిలో మున్నూరు కాపు సంఘం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మీదిగడ్డ మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సొంత నిధులతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. సంఘాలు అభివృద్ధి చెందుతేనే ఐక్యత ఉంటుందని అన్నారు. సంఘం ఒక బలం గా పరిగణించి కిందిస్థాయి వ్యవస్థనుండి సభ్యులు సంఘాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. కామారెడ్డి ప్రజలు ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయి వారిని ఎన్నికల్లో పక్కనపెట్టి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు కామారెడ్డి నియోజకవర్గానికి రుణపడి ఉంటాను అని అన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే కామారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాలలో ప్రజలు రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!