5 గురు అంతర్ రాష్ట్ర దొంగల రిమాండ్

5 గురు అంతర్ రాష్ట్ర దొంగల రిమాండ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);

సోషల్ మీడియా వేదికగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని వారి వద్ద నుండి వారిగా డబ్బులు దోచుకుంటున్న రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా యాప్లను ఉపయోగించి అమాయకులను మోసపూరితంగా వలలో వేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న మూఠాన అరెస్టు చేసి మొత్తం తొమ్మిది కేసులను చే దించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. గత నెల 25న ఒక బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి సోషల్ మీడియా యాప్ లా ద్వారా అమాయకులను పరిచయం చేసుకొని కామారెడ్డి పట్టణంలోని మెగా కార్ఫెట్ వద్దకు పిలిపించి అక్కడ ఫోటోలు తీసి, వాటిని అసభ్యకరంగా మార్చి కుటుంబ సభ్యులకు స్నేహితులకు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుండి ఫోన్ పే ద్వారా బలవంతంగా డబ్బులు వేసినారు అని వచ్చిన ఫిర్యాదు పై కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి జరియపు ప్రారంభించింది అని తెలిపారు. ఈ కేసు నమోదు సంబంధించిన వివరాలు తెలుసుకున్న కొంతమంది బాధితులు అదేవిధంగా మూస పైన వాళ్లు ఫిర్యాదులు ఇవ్వగా ప్రస్తుతం 9 కేసులు నమోదు అయినట్లు తెలిపారు కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు, తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ర2, నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు అయినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ సూచనలతో ఐపీఎస్ , ఏ ఎస్ పి ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి బాధితుల వద్ద నుండి ఫోన్ పే డేటాను సేకరించి నెంబర్ వన్ పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరిగింది. వ్యక్తుల కోసం గాలించగా రైల్వే స్టేషన్ లో ఉన్నారని సమాచారంతో గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!