ప్రమాదాలు జరిగితే తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి: పి ప్రావిణ్య జిల్లా కలెక్టర్

ప్రమాదాలు జరిగితే తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి: పి ప్రావిణ్య జిల్లా కలెక్టర్

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)

ప్రతి క్లస్టర్లో అధునాతన పరికరాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు అన్ని చర్యలు వెంటనే చేపట్టాలి ప్రమాదం జరిగిన సమాచారం వెంటనే అన్ని శాఖల అధికారులకు అందించాలి అన్ని క్లస్టర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, అగ్నిప్రమాదాలు, పేలుడు ప్రమాదాలు , విష వాయువులు ఉత్పత్తి, నిల్వ లేదా వినియోగం చేసే పరిశ్రమలను గుర్తించాలి

హై రిస్క్ కర్మాగారాలలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరిశ్రమల యాజమాన్యానికి కార్మికులకు అవగాహన కల్పించాలి సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పరిశ్రమలలో ప్రమాదం జరిగి స్థలాలు తనిఖీ చేయాలి పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని హైరిస్క్ కార్మాగారాలలో భద్రతా ప్రమాణాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై పరిశ్రమలు , కార్మిక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఐల తో పాటు మిగిలిన క్లస్టర్లలో ఇక్కడ ప్రమాదం జరిగిన ఆయ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఇటీవల జరిగిన సిగాచి పరిశ్రమ విషాదం తర్వాత పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో సిగాచి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అన్ని క్లస్టర్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక బృందాలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలన్నారు ప్రమాదం జరిగిందన్న సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీవ్రతను తగ్గించడంతోపాటు అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టేలా వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలోని హై రిస్క్ కర్మాకారాలు సందర్శించి అంచనా వేసే కమిటీ సభ్యులు ఆయా పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు పరిశ్రమ యాజమాన్యం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

పరిశ్రమలు సందర్శించిన సమయంలో పరిశ్రమల యాజమాన్యం నుండి కార్మికుల పూర్తి వివరాలు సేకరించి ప్రమాదకర పరిస్థితులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పరిశ్రమలు ఉన్నాయా అవి పని చేస్తున్నాయా లేదా సరిచూసుకోవాలన్నారు అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన ప్రతిస్పందన చర్యలపై కార్మికులకు పరిశ్రమల యాజమాన్యానికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రమాద నివారణలో భాగంగా సెల్ఫ్ కంప్లైయెన్స్ చెక్లిస్ట్ ను ప్రతి హైరిస్ గా పరిశ్రమలు తప్పనిసరిగా సిద్ధం చేసి చట్టబద్ధ పత్రంగా పరిగణించాలని కలెక్టర్ సూచించారు. ఇందులో ప్లాంట్ లేఅవుట్లు అగ్నిమాపక డ్రాయర్లు నిల్వలో ఉన్న లేదా వినియోగించే రసాయనాల పూర్తి జాబితా ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులకు పరిశ్రమల యజమాన్యాలకు వివిధ శాఖల అధికారులకు సూచించారు.

ప్రమాదాలు జరిగిన సమయంలో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లాలోని పరిశ్రమలను ప్రత్యేకంగా క్లస్టర్లుగా విభజించి విపత్తు సంసిద్ధత మరియు రక్షణ ప్రణాళికలు సిద్ధం చేయించినట్లు కలెక్టర్ తెలిపారు .

భద్రత ప్రమాణాల లో రాజీలేదు:

జిల్లాలోని పరిశ్రమలు అన్ని రకాల భద్రతా ప్రమాణాలు అమలు చేసే విధంగా ఆయా శాఖల అధికారులు రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు భద్రతా తనిఖీ ఒక వేధింపు చర్యకాకుండా కార్మికుల భవిష్యత్తు పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన కార్యక్రమంలో చూడాలని అధికారులకు సూచించారు యజమాన్యాలు అనవసరంగా వేధించద్దని కలెక్టర్ సూచించారు చిన్నచిన్న పెట్టుబడులతో అంతర్నీర్మిత భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేస్తే ప్రామాణాస్తం తగ్గించవచ్చని ఆమె అన్నారు. అన్ని పరిశ్రమలలో పేలుడు ఉపశమన పానెల్ లు భద్రత ఉపశమన వాల్వులు రియాక్టర్లకు పగిలిపోయే డిస్క్ల వంటి లోపాలను వెంటనే సరి చేయాలని యజమాన్యాలను ఆదేశించారు .

రెండు నెలల్లో తనిఖీ ప్రక్రియ పూర్తి:

జిల్లా స్థాయి కమిటీలు వెంటనే షెడ్యూలు ప్రకారం తనిఖీలు ప్రారంభించి రెండు నెలలు మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే పరిష్కరించేలా పరిశ్రమల యాజమాన్యంతో సమన్వయం కొనసాగుతుందన్నారు. ఈ సెన్సిటైజేషన్ డ్రైవ్ కేవలం తనిఖీ మాత్రమే కాకుండా పరిశ్రమలో భద్రత సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

అన్ని పరిశ్రమలు సీసీటీవీలో తప్పనిసరి: ఎస్పీ పరతోష్ పంకజ్.

జిల్లాలోని అన్ని పరిశ్రమలలో సీసీటీవీలో నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ పరతోష్ పంకజ్ పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు పరిశ్రమల భద్రతలో సిసి టీవీ నిగా కీలకమైన ప్రతి ముఖ్యమైన ప్రదేశంలో కేవలం సక్రమంగా పనిచేయాలన్నారు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఫుటేజ్ లో నిల్వ చేయడం ద్వారా ప్రమాదా నివారణ దర్యాప్తులో ఇది సహాయపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీల డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ కె. గౌరీ శంకర్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, తెలంగాణ ఫ్యాక్టరీల డైరెక్టర్ ( ఎఫ్ ఏ ఎస్ సి) , వై. మోహన్ బాబు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి తుల్జా నాయక్ ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!