విధులకు గైర్హజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ లో విధులకు గైర్హజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు.

(సదాశివపేట్ సదాశివపేట మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12) సదాశివపేట సామాజిక ఆసుపత్రికి చెందిన ఏడుగురు వైద్యులకు నోటీసులు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఆసుపత్రికి చెందిన ఏడుగురు వైద్యులకు కలెక్టర్ ఆదేశాల మేరకు డి సి హెచ్ ఎస్ సంగారెడ్డి షోకాస్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో డాక్టర్ విజయ శంకర్ డిప్యూటీ సివిల్ సర్జన్, డాక్టర్ పి వి ఎస్ ఎన్ ఎన్ సత్యనారాయణ ( డి ఏ ఎస్), డాక్టర్ దివాకర్ (సి ఏఎస్), డాక్టర్ ఎస్ యాదగిరి (సి ఎస్ ఎస్), డాక్టర్ జి మల్లికార్జున్ (సి ఎస్ ఎస్), డాక్టర్ కె. ఉమామహేశ్వరి (సి ఎస్ ఎస్), డాక్టర్ రత్న సాయి (సిఏఎస్) లకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా,డి సి హెచ్ ఎస్ సంగారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!