బాలాజీ వైన్ షాప్ పై పోలీసుల దాడులు…

బాలాజీ వైన్ షాప్ పై పోలీసుల దాడులు…

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని వెల్దుర్తి బాలాజీ వైన్ షాప్ పై ఎస్సై బి అశోక్  సిబ్బందితో దాడులు నిర్వహించారు. వైన్ షాప్ ఆవరణం నందు మద్యం విక్రతదారులను కూర్చోబెట్టి మద్యం సేవిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడం సరైనది కాదని మద్యం విక్రతదారులకు హెచ్చరికలకు జారీ చేశారు. అక్కడ మద్యం సేవిస్తున్నటువంటి మందుబాబులు వైన్ షాప్ ఆవరణంలో ఉన్నటువంటి వారు దాడులు చేయడంతో పరారై పోయారు. వైన్ షాప్ ఆవరణంలో ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను ప్లగ్గులు తీసి నిలుపుదల చేశారు. దీంతో మందుబాబులు బెంబేలెత్తి పోయారు. అనుమతులు లేకుండా వైన్ షాప్ ఆవరణము నందు కూర్చోబెట్టి మద్యం సేవింప చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాపు యాజమాన్లకు సీఐ హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వనీయత సమాచారం.

Akhand Bhoomi News

error: Content is protected !!