మారుమూల గ్రామం నుంచి సత్తచాటిన కుర్రోడు
వాటికన్ హై స్కూల్ కు ప్రథమ బహుమతి
(నారాయణఖేడ్ ప్రతినిధి అఖండ భూమి వెబ్ న్యూస్ 15 )
నారాయణఖేడ్ మండలంలోని అబ్బేందా పీర్ల తాండ గ్రామానికి చెందిన ఒక రైతుబిడ్డ రాథోడ్ బన్సీలాల్ తనయుడు డీయస్ డి నవీన్ రాథోడ్ఎంతో కష్టపడి ఇష్టపడి డ్యాన్స్ ను నేర్చుకున్నాడు అలాగే ఉండిపోవద్దని తనతో పాటు కొంతమంది పిల్లలకు డాన్స్ నేర్పించడం జరిగింది.వారిలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన వాటికన్ హై స్కూల్ కు చెందిన పిల్లలకు డాన్సులు నేర్పించి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మొత్తం 12 స్కూల్ లలో వాటికన్ స్కూలుకు చెందిన పిల్లలకు ప్రథమ బహుమతి రావడం జరిగింది. ఈ ప్రథమ బహుమతి రావడం వల్ల వాటికన్ హై స్కూల్ కు చెందిన ప్రిన్సిపల్, స్కూల్ యాజమాన్యం ఎంతో సంతోషించారు. అలాగే డాన్స్ మాస్టర్ డిఎస్డి నవీన్ రాథోడ్ ను అభినందించారు ఈ బహుమతిని నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి వారి చేతుల మీదుగా పిల్లలను బహుకరించాడు.ఈ కార్యక్రమంలో వాటికన్ హై స్కూల్ డైరెక్టర్ ప్రశాంత్,ప్రిన్సిపాల్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ రాధిక,ముఖ్యులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



