సభను జయప్రదం చేద్దాం…

కుల మతాలకతీతంగా కదలిరండి జైభారత్ సామాజిక విప్లవ రణభేరి (జోగిపేట) సభను జయప్రదం చేద్దాం

 (అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)

_ సుప్రీంకోర్టు న్యాయవాది మన బీన్ ఫౌండేషన్ చైర్మన్ ముఖీం బాయ్

_ టీఎస్ ఎస్పీడీసీఎల్ డి.ఈ అమృత రావు

జై భారత్ సామాజిక విప్లవ రణభేరి ఆధ్వర్యంలో ఈనెల 17నాడు జరిగే గాంధీ అంబేడ్కర్ల సమావేశం కోసం జరుగుతున్న జై భారత్ 100 సభలో మొదటి సభ జోగిపేట కేంద్రంగా జరగడం గొప్ప విషయమని ఈ సభలను ప్రజలు జయప్రదం చేయాలని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది మన బీన్ ఫౌండేషన్ చైర్మన్ ముఖీం భాయ్, టీఎస్ ఎస్పీడీసీఎల్ డి ఈ అమృత రావు లు అన్నారు.

అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ముఖ్యం బై ఫామ్ హౌస్ లో జరిగిన సన్నాహక సమావేశంలో జై భారత్ సామాజిక విప్లవర రణభేరి ఆధ్వర్యంలో గాంధీ అంబేడ్కర్ల ఆశయ సాధన కోసం జరుగుతున్నటువంటి 100 సభలలో భాగంగా మొదటి సభ జగిపేట్ లో డాక్టర్ ముప్పారం ప్రకాశం ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణంగా ఉన్నదని ఈ సభలకి ఖధిజ్ఞాసి విజయ విహారం రమణమూర్తి గారు ముఖ్య అతిథిగా చేయడం గొప్ప విషయం అన్నారు.

నేటి వరకు ఈ దేశంలో మహనీయుల చరిత్రపై జరిగిన తప్పుడు ప్రచారాన్ని ఈ సభల ద్వారా ఎండగట్టాలని సామాజిక వాదులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర కన్వీనర్ ఖధిజ్ఞాసి డాక్టర్ ముప్పారం ప్రకాశం, ప్రముఖ న్యాయవాది మాతంగి చిరంజీవి, ఎమ్మార్పీఎస్ నాయకులు ముక్కగళ్ళ బిక్షపతి, జై భారత్ నాయకులు తప్పుడు రమేష్, దయాకర్, జై భారత్ విద్యార్థి నాయకులు గంగపురం రాబర్ట్, అరేటీ విజయ్, దుదగొండ శివ కుమార్, రెండ్లపల్లి రోహిత్, పల్లే కిషోర్ కుమార్, మన బిన్ ఫౌండేషన్ సభ్యులు జావీద్, చింటూ, రవి, ఎండి ఉమర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!