ప్రాణంగా ప్రేమించిన కొడుకు జ్ఞాపకార్థం కోసం వాటర్ ప్యూరిఫై వితరణ

-నవనాథపురం పాఠశాలకు
-మణికంఠ పేరుతో.. బారడ్ కిరణ్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 16: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణం పెద్ద బజారు లోని నవనాథపురం పాఠశాల విద్యార్థుల అవసరాల కోసం పట్టణానికి చెందిన బారడ్ కిరణ్ 79 వ స్వతంత్ర దినోత్సవం రోజు వాటర్ ప్యూరిఫై ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి అందజేశారు. ప్రాణతి ప్రాణంగా ప్రేమించే మణికంఠ అనారోగ్యంతో ఈ మధ్యకాలంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అనుముకున్నాయి. కొడుకు జ్ఞాపకార్థం కోసం ఏదైనా చేయాలనే తపనతో మణికంఠ జ్ఞాపకార్థం కోసం వాటర్ ప్యూరిఫై ని అందజేసినట్లు ఆయన కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కిరణ్ ను శాలువాతో సన్మానించి అభినందించి, మణికంఠకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, ప్రకాష్, లావణ్య, స్వప్న, అనురాధ, వాహిని తదితరులు ఉన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


