స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్
(సదాశివపేట మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆగస్టు 15ను పునస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ నినాదాలు తెలియజేశారు. ఈ సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్వతంత్రం అనేది మహాత్ముల యొక్క స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితమేనని కొనియాడారు, ఇట్టి స్వాతంత్రాన్ని పౌరులందరూ, ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రశ్నించే తత్వంతో అవినీతిని అంతం చేసే దిశగా, ప్రాంతాలను అభివృద్ధి పరిచే దిశగా ప్రయాణం కొనసాగించాలని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ గారు,ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరన్న, కోల విజయ్, నాగేష్, అశోక్, బీసీ నాయకులు జావిద్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



