24 న జోగిపేట కు మందకృష్ణ మాదిగ రాక  

24 న జోగిపేట కు మందకృష్ణ మాదిగ రాక

 

(ఆందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)

ఈ నెల 24 న నిర్వహిస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పెంపుకై నిర్వహిస్తున్న సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలనే డిమాండ్ తో వచ్చే నెల 09 తారీకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సన్నాహకంగా ఆందోల్ నియోజకవర్గంలో లో ఈ నెల 24 న సన్నాహక సభ నిర్వహించబోతున్నామని ఈ సభకు ఆందోల్ నియోజకవర్గంలోని వృద్ధులు వితంతువులు వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనీ విజయవంతం చేయాలని సమన్వయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు

ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు వితంతువులకు 4000 వేలు వికలాంగులకు 6000, ఒంటరి మహిళలకు 4000 , కండరాల నరాల క్షీణత తో బాధ పడుతున్న వారికి 15000 వేల పెన్షన్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రభుత్వం తో పెన్షన్ల దారుల తరపున తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు

ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య , మాజీ జడ్పీటీసీ అర్జునయ్య , సీనియర్ నాయకులు ఏర్పుల కృష్ణ, సంటెనోళ్ళ సంజీవయ్య, ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు మైసగల్ల బుచేంద్ర, కాకతీయ యూనివర్సిటీ నాయకుడు ఎర్రోళ్ల పోచయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, మాజీ కౌన్సిలర్ సంతోష్ , మాజీ ఎంపీటీసీ లింగయ్య ,చౌటకూర్ మండల ఎం.ఆర్ పి ఎస్ అధ్యక్షుడు రమేష్, జిల్లా కార్యదర్శి సాయిలు, నల్లోల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!