సోమవారం మంగళవారాలాలో జిల్లాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

సోమవారం మంగళవారాలాలో జిల్లాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

 

(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)

ఈ రోజు రాత్రి మరియు రేపటి రోజు జిల్లాలోనీ పలు మండలాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన మూలంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.

సోమవారం సాయంత్రం వర్గల్ మండలం అంబర్ పేట గ్రామ కాన్ చెరువు, వేలూరు గ్రామంలోనీ రంగం చేరువు, సామల పల్లి గ్రామంలోని సామల చెరువు మత్తడి దూకి రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాలను ములుగు మండలం లోని తునికి బొల్లారం గ్రామంలోని అయ్యప్ప చెరువు నిండి ముంపునకు గురైనా నివాసాలను పునరావాస కేంద్రాన్నీ జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సోమవారం మంగళవారాలాలో జిల్లాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాత్రి వేళల్లో మరియు రేపటి రోజు సైతం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వరద వస్తున్న ప్రాంతాల్లో వరద ఉదృతి ఇంకను పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని ప్రజలు పొలాల్లో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు ఉండకుండా చూసుకోవాల్సిందిగా, పాత ఇండ్లలో ఎవరు నివసించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులు శాటింపు చేయించాలని తెలిపారు. నీరు ఎటు వెళ్ళాక రోడ్డుపై అక్కడ అగు తున్న ప్రదేశాల్లో జెసిబి పెట్టి కాలువలు తీసి నీరు వెళ్ళే విధంగా చెయ్యాలని కి ఎంపీడీవోలు ఆదేశించారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. లో లెవెల్ వంతెనల నుండి నీరు వెళ్తే రాకపోకలు నిలిచిపోయేలా అలాగే శిథిలావస్థలో ఉన్న వంతెనలను సైతం ఎల్లప్పుడూ మానిటర్ చేయాలని రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

కలెక్టర్ వెంట గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!