సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
సింగూర్ ప్రాజెక్టు పై అధికారులతో సమీక్ష.
జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల లో వేగం పెంచాలి.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష.
సి ఎస్ ఆర్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలి.
జిల్లాలో పడుతున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లు సింగూరు ప్రాజెక్టు నుండి సాగునీటి సరఫరా, ప్రాజెక్టు భద్రత ఏర్పాట్లు , వరద ఉధృతి, జిల్లాలో ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల పై , జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ, సమీక్ష నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … జిల్లాలో డెంగ్యూ ,మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు , విష జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో గ్రామాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలో సమన్వయంతో పంచాయతీ మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగ్యూ ,చికెన్ గున్యా ,మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా జిల్లాలోని 632 గ్రామపంచాయతీలో పెద్ద పంచాయతీలు చిన్న గ్రామాలు అన్న తేడా లేకుండా,అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీవోలు పంచాయతీ కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు .బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేలా మందులు, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రతి వారం ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు గత 15 రోజులకు సంబంధించి ఆయా గ్రామాలలో వ్యాధుల బారిన పడిన ప్రజల వివరాలకు సంబంధించిన రిపోర్టులను మండల స్థాయి అధికారుల ద్వారా జిల్లా స్థాయికి పంపాలని సూచించారు.
సింగూరు డ్యాం మరమత్తులపై ఎన్ డి ఎస్ ఏ నివేదికపై ఉన్నత స్థాయి కమిటీ నియమకానికి మంత్రి ఆదేశం.
సింగూరు డ్యాం మరమ్మత్తుల సమయంలో నీటి నిలువపై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్యాం మరమ్మతులకు ఈఎంసి స్థాయిలో క్షేత్రస్థాయి లో పర్యటించి అవసరమైన డిపిఆర్ లను సిద్ధం చేసి ప్రభుత్వానికి వెంటనే నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేయడంలో గత పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.
సింగూరు డ్యాం భద్రతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింగూరు డ్యాం కు శాశ్వత మరమ్మత్తులు చేసేందుకు ప్రభుత్వం ఎంతటి ఖర్చుకైనా సిద్ధంగా ఉందని తెలిపారు. సింగూర్ డ్యాం పరిరక్షణకు దేశంలో అత్యున్నత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించేందుకు అవసరమైన డీపీర్ లను సిద్ధం చేయాలనీ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.సింగూర్ డ్యాం పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని మంత్రి ఆదేశించారు. సింగూర్ కాలువల లైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు సకాలంలో సింగూర్ డ్యాం నుండి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి. పెద్దారెడ్డిపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సర్వే పనులు త్వరగా పూర్తిచేసి డి పి ఆర్ నివేదికను ప్రభుత్వానికి అందించాలని జిల్లా స్థాయి సమీక్ష సమావేశం లో ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు
జిల్లాలో 16559 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు. అందులో 14,391 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శర వేగంగా జరుగుతుందని మంత్రికి వెల్లడించిన హౌసింగ్ శాఖ అధికారులు.
జిల్లాలో ఇప్పటివరకు బేస్మెంట్ లేవల్ పూర్తి చేసిన లబ్ధిదారులు 2996, వీరిలో 2435 మందికి లక్ష రూపాయల చొప్పున అందించామన్నారు. గ్రూప్ లెవెల్ ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసిన లబ్ధిదారులు 224 , వీరికి 150 మందికి 3 కోట్ల రూపాయలు అందించామన్నారు. స్లాబ్ లెవెల్ పూర్తి చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 87 మందిలో 66 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 64 లక్షల రూపాయలను అందించామని మంత్రి కి హౌసింగ్ శాఖ అధికారులు వివరించారు.
మిగిలిన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు నిర్మించుకునేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఆర్ అండ్ బి శాఖపై సమీక్షించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ…. జిల్లాలో చేపట్టిన పనుల వివరాలను వెంటనే సమర్పించాలని మంత్రి ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనుల వివరాలు, కాంట్రాక్టర్లు చేసిన పనులు వివరాలు అందించాలని ఆదేశించిన మంత్రి.
జిల్లాలో మారుమూల గిరిజన తండాలను అనుసంధానం చేసి రోడ్డు మార్గాలను నిర్మించాలని శాఖ అధికారులను ఆదేశించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. హెచ్ ఏ ఎం లో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా డీపీర్ లను సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
అంగన్వాడి భవనాల నిర్మాణం, పరమత్తులు, గ్రామపంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య భవనాల నిర్మాణాలను, ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులు మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆదేశించారు.సెప్టెంబర్ లోగా నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారం ఆదేశించారు.
ఎరువుల కొడతా రాకుండా అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలి: జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొడతా రాకుండా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ మార్క్ఫెడ్ శాఖల అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు ఎరువులు ఎక్కడ ఏ ఎరువులకు డిమాండ్ ఉందో అక్కడికి సకాలంలో ఎరువులు చేర్చేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఏఈవోలు ఏవోలు ప్రతిరోజు తమ పరిధిలో నీ ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ ఎరువులు పక్కదారి పట్టకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్కు సరిపడా ఎరువులు నిల్వ ఉంచేలా ,జిల్లాలో ఎక్కడా కొరత సమస్య తరితకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు రోడ్ల నిర్మాణ పనులు విద్యాసంస్థల నిర్మాణం పనులలో వేగం పెంచాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారుల ఆదేశించారు. జిల్లాలో ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ టి జి ఎం ఐ డి సి , ఈ డబ్ల్యూ ఐ డి సి, శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు . ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎస్ఆర్ నిధులతో ప్రైవేట్ కంపెనీలు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను పై మంత్రి ఆరా తీశారు. సిఎస్ఆర్ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలన్నారు .స్థానిక అవసరాలను విద్యా వైద్య సౌకర్యాలు మెరుగు కోసం సిఎస్ఆర్ నిధులను వెచ్చించాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా ప్రాంతీయ ఆసుపత్రులలో మౌలిక వసతుల మెరుగు కోసం సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చే పనులు చేపట్టేలా అవసరమైన ప్రణాళికల రూపొందించాలని ఇప్పటికే ప్రారంభించా పనులు సకాలంలో పూర్తయిల చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సి పి ఓ బాలశౌరి , జిఎం డి ఐ సి , తుల్జా నాయక్ , డీఈవో , వెంకటేశ్వర్లు , డి ఐ ఈ ఓ , గోవింద్ రామ్ , పంచాయతీ రాజ్ R&B, టీజీ్విడీసీ, టీజీమిడీసీ అధికారులు, డి ఎం హెచ్ ఓ,నాగ నిర్మల , డిసిహెచ్ఎస్, సంగారెడ్డి , డిపో సాయి బాబా డిలీపోస్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ఈ ఈ–పబ్లిక్ హెల్త్, ఎస్ ఈ – ఆర్డబ్ల్యూఎస్ , డి ఏ ఓ , డి సి ఓ, డి ఎం–మార్క్‌ఫెడ్, పీడీ –హౌసింగ్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ వి ఎస్ ఈ –మిషన్ భగీరథ, ఎస్ ఇ & ఈ ఈ –ఇరిగేషన్ తదితరులు హాజరయ్యారు.


