దోమకొండకు వచ్చిన స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చదువే ముఖ్యం అని చెప్పిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ మార్గంలో నడుస్తూ గురుకులాల ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా ఉన్నప్పుడు గురుకులల్లో చదివే పేద వర్గాల విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య ను, పౌష్టికరమైన ఆహారంను అందించి ఉన్నత విద్యావంతులు అవడానికి కృషి చేసిన స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బుధవారం
దోమకొండ మండల కేంద్రానికి చెందిన
స్వేరోస్ నెట్ వర్క్ వైస్ చైర్మన్ దేవరగట్టు బాలప్రసాద్ వాళ్ళ అమ్మ చనిపోతే పరామర్శించటానికి వచ్చి వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పటం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ చైర్మన్ మామిడాల ప్రవీణ్ కుమార్, దుర్గయ్య, స్వేరోస్ సభ్యులు బట్టెంకి బాల్ రాజు,లక్ష్మణ్, బొంద రాజ్ కుమార్, కర్రోళ్ల రాజు, స్వేరో కోర్ చైర్మన్ బాబు నాయక్, బట్ట రాములు,గంగాల రవీందర్,పాత రాము,మురళి, తమ్మడి రాజు, సాయితేజ, ప్రవీణ్,గజ్జెల రవీందర్ లు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


