వాటర్ వర్క్ లో తగ్గే వరకు చెక్ డాంలపై మీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)
వాటర్ ఓవర్ ఫ్లో తగ్గేవరకు చెక్ డాం పై నుండి రైతులు అటు ఇటు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని భీమేశ్వర వాగు పైన ఉన్న భీమేశ్వర చెక్ డ్యామ్ ను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన చెక్ డాం పై నుండి వాటర్ పారు తుందడం గమనించారు. వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు గ్రామం నుండి పంట పొలాలకు ఈ చెక్ డాం పై నుండి వెళ్లి వస్తారని తెలుసుకొని అధికంగా వర్షాలు కురిసి చెక్ డాం ఓవర్ ఫ్లో అవుతున్నందున చెక్ డ్యాం దాటేటప్పుడు రైతులకు ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున చెక్ డాం పైనుంచి రైతులు వెళ్లకుండా అడ్డంగా ట్రాక్టర్ గాని ఇతర బ్యారికేడ్స్ గాని ఏర్పాటుచేసి నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మల్లేష్, జేఈ మధు, ఎంపీడీవో సాజిద్ అలీ, మండల ప్రత్యేక అధికారి, తాసిల్దార్, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.



