ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా బుధవారం జరుపుకున్నారు. ఆయన ప్రధానిగా చేసిన సేవలను కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం మధు ముదిరాజ్, ఆశం శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి తాటిపల్లి శ్రీకాంత్, నల్లపు శ్రీనివాస్, అండెం శంకర్ రెడ్డి, కదిరి గోపాల్ రెడ్డి, రావులపల్లి నర్సారెడ్డి, రామస్వామి గౌడ్, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, షమ్మీ,, ఇలియాస్, నేతుల మల్లేశం, నిమ్మ బాల్రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



