కార్ల వాహనాల విక్రయాల దందాను పట్టుకున్న కామారెడ్డి పోలీసులు…

కార్ల వాహనాల విక్రయాల దందాను పట్టుకున్న కామారెడ్డి పోలీసులు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)

ఆన్లైన్లో కార్లను విక్రయించే ముఠా దందాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఫేక్ ఐడి కార్డులు, ఫేక్ ఆర్సీలతో కార్లను అమ్ముతూ తిరిగి వాటిని చోరీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫేస్ బుక్ అప్లికేషన్ ద్వారా కారు కొనుక్కున్న వ్యక్తుల కారును రెండు రోజుల తర్వాత కారు నాది.. మీరెలా కొనుక్కుంటారు అని బెదిరిస్తూ కారును తీసుకెళ్తున్న కేసు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో జులై 1 న నమోదు కాగా విచారణ ప్రారంభించడం జరిగిందన్నారు. కారు సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని అద్దెకు తీసుకుని ఏడుగురు ముఠా సభ్యులు దానికి ఫేక్ నంబర్ ప్లేట్, ఫేక్ ఆర్సీ తయారు చేస్తారని తెలిపారు. ఆన్లైన్ లో ఎంప్టీ చిప్స్ కొనుగోలు చేసి వాటికి ప్రింట్ తయారు చేసుకుని ఫేక్ ఐడి కార్డులు తయారు చేస్తారన్నారు.

గుర్తింపు ఐడి ద్వారా ఫేక్ ఆర్సీ తయారు చేసి ఆ కారును విక్రయాలు జరుపుతారని, అదే కారుకు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన జిపిఎస్ ట్రాకర్ అమార్చుతారని తెలిపారు. రెండు రోజుల తర్వాత జిపిఎస్ ద్వారా కార్డు అడ్రస్ తెలుసుకుని మరొక వ్యక్తి ఆ కారు యజమానిగా వెళ్లి ఫేక్ ఆర్సీ చూపించి ఇది మా కారు మీరెలా కొంటారని, పోలీస్ కేసులు చేస్తామని బెదిరించి, గొడవ పడి నకిలీ ద్వారా తిరిగి కారును తీసుకెళ్తారని తెలిపారు. తిరిగి యధావిధిగా ఎక్కడైతే కారును అద్దెకు తీసుకున్నారో మళ్ళీ వారికి కారును అప్పగిస్తారన్నారు. ఈ ముఠా కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని గత 10 రోజులుగా షేర్ లింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తలదాచుకున్న ముఠాలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరిన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!