తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెద్ద పోతన్నగారి రాము పటేల్ ఎన్నిక

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెద్ద పోతన్నగారి రాము పటేల్ ఎన్నిక

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా పెద్దపోతన్న గారి రాము పటేల్ ను ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం జిల్లా బీసీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, రాష్ట్ర ముఖ్య సలహాదారు క్రిస్టోఫర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు నరిగే ప్రవీణ్ కుమార్ పటేల్, పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరగాని బిక్షపతి గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరి డోంగ్లీ శ్రీనివాస్, రాష్ట్ర-జిల్లా బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి అని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియమించబడింది. జిల్లా అధ్యక్షులుగా పెద్దపోతన్నగారి రాము జిల్లా ఉపాధ్యక్షులుగా నాగం దేవేందర్, గంధపు రాజు, ప్రధాన కార్యదర్శిగా పోగు పండు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుడాల శ్రీనివాస్, బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక ఆకర్షణగా జిల్లా జిల్లా అధ్యక్షుని నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అందజేయగా, సభలో ఘనంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భం పై రాము పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు.బీసీల అభ్యున్నతి, సమాజ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నిక అయినటువంటి జిల్లా కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!