కామారెడ్డి బీసీల సభతో బీజేపీ భరతం పడతాం..!

కామారెడ్డి బీసీల సభతో బీజేపీ భరతం పడతాం..!

 

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; సెప్టెంబర్ 7 (అఖండ భూమి న్యూస్) ఈనెల 15వ తేదీన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభతో బీజేపీ భరతం పడతామ‌ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై, ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ. కింది స్థాయి కార్యకర్తలు కష్టపడితేనే నేడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అన్నారు. బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో విద్యా ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామ‌న్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం పంపి గవర్నర్ కి పంపించామ‌ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల వల్లనే బీసీ బిల్లు ఆమోదం చేయకుండా ఆపుతున్నారని అన్నారు. బీసీ బిల్లు కోసం బిజెపి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాటల్లో కాదు, చేతల్లో చూపించు బండి సంజయ్‌కి మహేశ్ గౌడ్ సంచలన సవాల్ విసిరారు.

రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు పిలుపునిచ్చారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సభ ద్వారా బిజెపి పై పోరాటం చేస్తామని, ఆనాడు రాష్ట్ర అధ్యక్షులుగా కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీచేసిన రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డి లోని ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం కామారెడ్డి లోనే బీసీ డిక్లరేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకై బిజెపి పార్టీపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ. కామారెడ్డి లో ఈనెల 15వ తేదీన బీసీ బిల్లు అమలుకై బహిరంగ సభ ఏర్పాటు చేసి బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతోనే భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నహాలు చేసినట్లు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సముచిత స్థానం లభిస్తుందని వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో ముందుకు సాగనింప చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బీసీలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ. బీసీలకు ఇచ్చిన మాట మీద కట్టుబడి అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కామారెడ్డి డిక్లరేషన్ పై కట్టుబడి బిల్లును ఆమోదింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. బిల్లుని కేంద్రం అడ్డుకోవడానికి కొన్ని విషయాలను సాకుగా చూపి అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!