చోరీ జరిగిన 48 గంటల్లో దొంగను పట్టుకొని చోరీ సత్తుని స్వాధీనం చేసుకున్న పోలీసులు

 

చోరీ జరిగిన 48 గంటల్లో దొంగను పట్టుకొని చోరీ సత్తుని స్వాధీనం చేసుకున్న పోలీసులు….శంఖవరం: (అఖండభూమి )చోరి నేరం జరిగిన 48 గంటల్లో దొంగను పట్టుకొని మొత్తం చోరి సొత్తును స్వాధీనం చేసుకున్న కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు 13-05-2023 వ తేది అర్దరాత్రి అన్నవరం గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని నేరస్తుడు ఇంటి తాళాలు పగులగొట్టి, లోపలి ప్రవేశించి, బీరువాలో ఉన్న సుమారు 33.8 కాసులు బంగారు ఆభరణాలు, 1.5 కెజి లు వెండి వస్తువులను దొంగాలించుకు పోవడం జరిగింది సదరు విషయం పై కేసు నమోదు చేసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐ. పి.ఎస్ ఆదేశాల ప్రకారం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ సూచనలు మేరకు మరియు పెద్దాపురం ఎస్.డి.పి.ఒ కె. లతా కుమారి ప్రత్యేక పర్యవేక్షణ లో ప్రత్తిపాడు సి.ఐ. కె కిషోర్ బాబు ఆధ్వర్యం లో అన్నవరం ఎస్సై.పి శోభన్ కుమార్ ఏలేశ్వరం ఎస్సై. జి. సతీష్ , ప్రత్తిపాడు ఎస్సై యం .పవన్ కుమార్ వారి సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి 48 గం.లు లో ఈ కేసు ను చేధించడమైనది

తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కన్నపునేరాలకు పాల్పడుచున్న, నర్సీపట్నం మండలం పీనారిపాలెం గ్రామానికి చెందిన చిటికల నాగేశ్వరరావు 32 అను అతను గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా 2015 సంవత్సరంలో నియమించబడి, అప్పటినుండి ఇతను ఆలమూరు మండలం నర్సిపూడి , కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో గ్రామీణ బ్యాంకు నందు పని చేసి, తదుపరి గొల్లప్రోలు గ్రామంలో గ్రామీణ బ్యాంకు నందు పనిచేస్తున్న సమయంలో సుమారు ఒక సంవత్సరం పాటు అన్నవరంలో శ్రీ సత్య దేవా జూనియర్ కాలేజీ వెనుకన ఉన్న

న్యూ కాలనీలో కుటుంబం తో పాటు కాపురం ఉండి, అనంతరం ఏలేశ్వరం, అ తదుపరి నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగు లకు అలవాటు పడిన నేపథ్యంలో అక్రమార్చన కొరకు బ్యాంకులో ఉన్న లాకర్ లలో ఉన్న బంగారాన్నికూడా దొంగిలించి అమ్ముకొన్నకేసులో అవకతవకలకు పాల్పడినందున నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ బెట్టింగుల నిమిత్తం డబ్బు గురించి దొంగతనాలకు పాల్పడినాడు. ఇదే క్రమంలో గతంలో ఏలేశ్వరం గ్రామంలో

ఏ.టి.యం చోరీకి పాల్పడి 2,34,000/- రూపాయలు చోరీ చేసిన కేసులో ఏలేశ్వరం పోలీసులు అరెస్టు చేసి ఇతన్ని రిమాండ్ కు పంపడమైనది. డబ్బు సంపాదించాలని జైలు నుండి బెయిల్ పై రిలీజైన నిందితుడు గతంలో తాను కాపురం ఉన్న అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజీ వెనుక తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని 12-05-2023 వ తేదీ అర్ధరాత్రి గోగుల వీరభద్ర రావు గారు అద్దెకు ఉంటున్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప కట్టర్ తో ఇంటి తాళాలు బ్రద్దగొట్టి సుమారు 33.8 కాసుల బంగారు, 1.5 కె.జి వెండి ఆభరణములను మరియు 50 వేల రూపాయలు డబ్బును కాజేసి పరారీ అయినాడు. దీనిపై గోగుల వీరభద్రరావు గారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు కట్టి ప్రత్తిపాడు సి.ఐ.కె కిషోర్ బాబు అతి చాకచక్యం గా సదరుపై నిందితుడిని కేవలం 48 గంటల వ్యవధిలో అరెస్టు చేసి పోయిన మొత్తం చోరీ సొమ్మును రికవరీ చేయడమైనది.

ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగులు మరియు ఆన్లైన్ యాప్ లలో బెట్టింగ్ 12 బెట్ డాట్ కం ద్వారా అక్రమార్జనకు అలవాటు పడి, అప్పులపాలయ్యి వాటినుండి బయటపడలేక తదుపరి దొంగతనములు, కన్నపు నేరంలకు పాల్పడుతూ మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ యువత వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, యువత తప్పుదారి పట్టడం వల్ల దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, యువత స్వసక్తితో అభివృద్ధి చెందాలి గాని ఇటువంటి అక్రమార్జన కొరకు, బెట్టింగులకు అలవాటు పడి వారి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలియజేయుచున్నామని అదేవిధంగా వేసవి సెలవులకు ఊర్లు వెళ్ళే ప్రజలు తప్పని సరిగా వారి విలువైన ఆభరణాలను, నగదును ఇంటివద్ద వదిలి వేయకుండా బ్యాంకు లాకర్ నందు జాగ్రత్తపరుచుకోవాలని, అదేవిదంగా మీరు ఊరులో లేని సమయంలో మీ ప్రక్క ఇంటి వారిని రాత్రిపూట ఇంటి వద్ద లైట్ వేసి ఉంచమని, ప్రహరిగోడ గేటుకు తాళము వేయటం వలన ఎవరూ లేరని తెలుస్తున్నదున అలాతాళము వేయకుండా ఉంచి పక్క ఇంటి వారిని ప్రతిరోజు లైట్ వేయమని , ముఖ్యంగా ప్రతి ఒక్కరు సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవలె నని

కేవలం 48 గంటల వ్యవధిలో ఒక నటోరియస్ క్రిమినల్ ను పట్టుకొని ౩౩.8 కాసుల బంగారం మరియ 1.5 కె.జి వెండి చోరీసొత్తును ఎంతో చాకచక్కంగా రికవరీ చేసి ఫిర్యాదుకు అందించిన ప్రత్తిపాడు సి.ఐ. కె .కిషోర్ బాబు ని ఈ క్రమంలో వారికి ఎంతో సహాయ సహకారం లను అందించిన అన్నవరం ఎస్సై.పి .శోభన్ కుమార్ కి, అడిషనల్ ఎస్సై.బి.అజయ్ బాబు కి, ఏలేశ్వరం ఎస్సై.జి .సతీష్ కి, ప్రత్తిపాడు ఎస్సై. ఎం. పవన్ కుమార్ కి మరియు సిబ్బందికి కాకినాడ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియపరిచినారు.

ముద్దాయి వివరాలు

చిటికెల నాగేశ్వరరావు, తండ్రి/సత్తిబాబు, 32 కొప్పుల వెలమ, పీనారిపాలెం గ్రామం, నర్సీపట్నం మండలం, అనకాపల్లి జిల్లా

రికవరీ చేసిన చోరి సొత్తు వివరాలు :

33.8 కాసుల బంగారు ఆభరణములు ప్రస్తుత మార్కెట్ విలువ 21,29,400/

1.5 కేజీ వెండి వస్తువులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 1,15,500

మొత్తం రికవరీ సొత్తు విలువ 22,44,400 ఇరవై రెండు లక్షల నలబై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు

మరియు నేరం కు ఉపయోగించిన కట్టర్ మరియు తెలుపు రంగు మారుతి స్విఫ్ట్ కార్ AP05 ఇఎ్స్ 4578

Akhand Bhoomi News

error: Content is protected !!