నాసిరకం నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 23 (అఖండ భూమి న్యూస్) నాసిరకమైన నిత్యవసర వస్తువులను అమ్ముతూ, తూకంలో మోసం చేస్తూ సూపర్ మార్కెట్ల యజమానులు ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి అని వినియోగదారులపైనే సూపర్ మార్కెట్ యజమానులు మండి పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ వినియోగదారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక సూపర్ మార్కెట్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కామారెడ్డి లోని శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో నిత్యవసర వస్తువులను కొనుగోలు చేశాడు. అందులో 250 గ్రాముల శనిగలు కొనుగోలు చేయగా ప్యాకింగ్ లో మాత్రము 180 గ్రాములు మాత్రమే ఉన్నాయి. అలాగే నల్ల నువ్వులు కొనుగోలు చేయగా వాటిని నీటిలో కడగగానే వాటి రంగు మారిపోయింది. తెల్ల నువ్వులకే నలుపు రంగు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా రంగులు వేస్తూ నిత్యవసర వస్తువులను కల్తీ చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. ఇదేమిటని సూపర్ మార్కెట్ యజమానిని అడిగితే ఏమైనా చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కల్తీకి పాల్పడుతూ, తుకంలో మోసం చేస్తున్న సూపర్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు.
You may also like
దుర్గామాతకు ఏ రోజు ఏ ప్రసాదం సమర్పించాలి..?
గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…