తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ విద్యార్థికి గ్రూప్-2 లో ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపిక…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ విశ్వవిద్యాలయం, సౌత్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన తల్లిదండ్రులు రాధిక -జైపాల్ రెడ్డి కుమార్తె కంకణాల శ్రీజా రెడ్డి కీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్- 2 ఫలితాలలో ఎక్సైజ్ ఎస్సైగా గా ఎంపిక కావడం జరిగింది. మొన్న గ్రూప్ -1ఫలితాలలో సైతం ఎం.పీ.డీ.ఓ గా ఎన్నిక కావడం జరిగింది, ఒకేసారి రెండు ఉద్యోగాలు రావడంతో శ్రీజ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. క్యాంపస్ లోని ప్రశాంతమైన వాతావరణం మరియు అధ్యాపకుల యొక్క సూచనలు , ప్రోత్సాహం తనకు బాగా కలిసొచ్చాయన్నారు .ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్, మరియు డిపార్ట్మెంట్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే రెండు ఉద్యోగాలు సాధించడం క్యాంపస్కు గర్వకారణం అన్నారు. విద్యార్థులు ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళితే, ఫలితాలు సాధించవచ్చు అని, విజయం సాధించవచ్చని, రానున్న రోజులలో సౌత్ క్యాంపస్ లోని విద్యార్థులు ప్రభుత్వ రంగాలలో మరింత స్థిరపడాలని కోరారు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు, పోటీ పరీక్షల కోసం మరిన్ని సౌకర్యాలను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ సహకారంతో విద్యార్థులకు అందిస్తామన్నారు. సౌత్ క్యాంపస్ అధ్యాపక బృందం , మరియు విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


