*రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బి) ఎన్టిపిసి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 8,875 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 5,817 గ్రాడ్యుయేట్ పోస్టులు, 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను సి బి టి-1, సి బి టి -2 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు తేదీలను ఆర్ ఆర్ బి త్వరలో ప్రకటించనుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.rrbcdg.gov.in ను సందర్శించాలని సూచించారు.


