విమర్శల వార్తలపై జర్నలిస్టులపై కేసులు సరికావు..!

*విమర్శల వార్తలపై జర్నలిస్టులపై కేసులు సరికావు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);

సుప్రీంకోర్టుప్రభుత్వాలపై విమర్శనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1)(ఏ) ప్రకారం విమర్శించడం, అభిప్రాయాలు వ్యక్తపరచడం ప్రతి పౌరుడి సహజ హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై వార్త రాసినందుకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన కోరగా, విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్ట్ చేయరాదనే మధ్యంతర రక్షణ ఆదేశాలు జారీ చేసింది.సుదీర్ఘ చర్చ అనంతరం ధర్మాసనం పేర్కొన్నది— “ప్రజాస్వామ్య దేశంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం, విమర్శించడం స్వేచ్ఛగా ఉండాలి. ఆ హక్కును పరిమితం చేసే ప్రయత్నం రాజ్యంగ హామీలకు విరుద్ధం. జర్నలిస్టుల హక్కులు రాజ్యాంగం కాపాడుతుంది” అని తీర్పులో పేర్కొంది.జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు లేదా అనవసరమైన కేసులు ప్రెస్ స్వేచ్ఛను దెబ్బతీస్తాయని, ఇటువంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు అవసరమని సుప్రీంకోర్టు సూచించింది.ఈ తీర్పుతో జర్నలిస్టుల వృత్తిరంగ స్వేచ్ఛ, భద్రత, గౌరవానికి బలం చేకూరిందని మీడియా వర్గాలు స్వాగతం తెలియజేశాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!