రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఆదికవి ఈ మన జీవితానికి మార్గదర్శకం…

రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఆదికవి ఈ మన జీవితానికి మార్గదర్శకం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);

కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “మహర్షి వాల్మీకి ఆదికవి, ఆయన రచించిన రామాయణం నిత్యనూతన గ్రంథం. ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం మార్గం ప్రతి మనిషి జీవనానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ, ట్రైని డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, డిఎస్సీడీవో వెంకటేష్, డిఎం డబ్ల్యూ సతీష్ యాదవ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ , సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్ , నరేష్ , అశ్వాక్, జీవన్, శాంతయ్య, స్వామి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!