బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది అధైర్యపడవద్దు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి.

బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది అధైర్యపడవద్దు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి.

యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఆదివారం తాళ్ళరేవు నేషనల్ హైవే 216 బైపాస్ సీతారామపురం సుబ్బారాయుడు దిమ్మ సెంటర్ వద్ద ప్రైవేటు బస్సు ఆటో డీ కొనడంతో యానం ప్రాంతవాసులు మృతి చెందడంతో బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని అధైర్య పడొద్దని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కో మృతిని కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.లక్ష సహాయం క్షతగాత్రులకు రూ.30 వేలు చొప్పున సహాయం ప్రకటన. కంపెనీల నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల సహాయం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ వెల్లడించారు.

216 తాళ్లరేవు-యానాం బైపాస్ రహదారిలో సుబ్బారాయుని దిమ్మ ప్రాంతంలో ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో మృతిచెందిన యానాం కు చెందిన మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని ఎక్కువ మొత్తంలో ఆర్థికసహాయం వచ్చేలా కృషి చేస్తున్నట్లు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను, వారి పిల్లలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు యానాం శాసనసభ్యుడిగా, వ్యక్తిగతంగా ఒక్కో మృతిరాలి కుటుంబానికి రూ. లక్ష ఆర్థికసహాయం అందిస్తున్నట్లు తెలిపారు క్షతగాత్రులకు రూ.30,000 సహాయం అందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా ప్రస్తుతం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు రొయ్యల ఫ్యాక్టరీ నుంచి మృతులకు ఇన్సూరెన్స్ ఉందన్నారు, వారు ఒక్కొకరికి రూ.5లక్షలు ఇవ్వనున్నారన్నారు అదేవిధంగా ప్రమాదానికి కారకులైన ట్రావెల్స్ యాజమాన్యంతో తాను మాట్లాడానని వారి నుంచి కూడా సహాయం అందుతుందని ఇప్పటికే దానిపై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా వివిధ స్వచ్ఛందసంస్థలనుంచి మరింత సహాయం అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా ఎవరైనా స్వచ్చందంగా బాధిత కుటుంబాలను ఆదుకోవచ్చునని అన్నారు మొత్తం మీద ఒక్కో కుటుంబానికి రూ.12 నుంచి రూ.13లక్షల వరకు సహాయం అందుతుందని భావిస్తున్నట్లు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఫ్యాక్టరీల మూసివేతతో ఉపాధిలేనిస్థితిలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు ఆటో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల పరిస్థితి క్షేత్రస్థాయిలో చూసి చలించి పోయానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పేర్కోన్నారు. కొన్నేళ్లుగా యానాంలో ఫ్యాక్టరీలన్నీ మూసివేతకు గురయ్యాయని దీంతో ఉపాధి లేకపోవడంతో రొయ్యలఫ్యాక్టరీల్లో పనిచేసుకుంటూ ఆయా కుటుంబాలు నెట్టుకొస్తున్నాయన్నారుమృతుల కుటుంబాల ఇండ్లకు వెళితే వారి ఏరోజుకు ఆరోజు కూలిపనికి వెళ్లి వచ్చిన డబ్బులతో నెట్టుకొచ్చే కుటుంబాలే ఉన్నాయని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!