డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు.

 

యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :

(అఖండ భూమి) యానాం డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులలో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్షలో

ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం.బి.ఏ. ఎకనామిక్స్50,బి.కామ్ జనరల్ 40,

బి.ఎస్సీ మాథమాటిక్స్30,బి.ఎస్సీ ఫిజిక్స్20,బి ఎస్సీ కెమిస్ట్రీ 30,బి.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ 40,బి.ఎస్సీ. జువాలజి25,బి.ఎస్సీ,బోటని20 కోర్సులకు 16-05-2023 నుండి 29-06-2023 గురువారం వరకు అన్ని పనిదినములలో 20 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని పూర్తి చేసిన దరఖాస్తుల్ని తిరిగి కళాశాలలో ఇవ్వడానికి చివరి తేది 30-06-2023.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అతి తక్కువ ఫీజు ఉంటుంది మొదటి సంవత్సరం 2,500 రెండు మరియు మూడు సంవత్సరాలకు1,500చొప్పున ఫీజు ఉంటుందని కోర్స్ ను బట్టి స్వల్పంగా ఫీజు మారుతుందని పరీక్షల ఫీజు అదనం కళాశాల పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగి ఉండటం వలన అతి తక్కువ ఫీజుతో సెంట్రల్ యూనివర్సిటీ డిగ్రీ పొందవచ్చును.జులై మొదటి లేదా రెండవ వారంలో విద్యార్థులకు అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఉంటుందని జూలై 17వతారీఖు నుండి తరగతులు మొదలవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ వరుగు భాస్కర్ రెడ్డి

పత్రికా ప్రకటనలో తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!