
శంఖవరం (అఖండభూమి) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాద యాత్ర 100 రోజులు పూర్తి చేసుకొన్న సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వరుపుల సత్య ప్రభ రాజా గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంఘీభావ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అన్నవరం సత్య దేవుని పాదాల నుండి చేపట్టిన ఈ పాదయాత్ర అన్నవరం రైల్వే స్టేషన్ వరకు సుమారు 3 కిలోమీటర్లు కొనసాగింది,కార్యక్రమం లో నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసు కోవడానికి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాద యాత్ర అద్భుతంగా కొనసాగుతుంది అన్నారు,పాదయాత్ర కి వస్తున్న స్పందన చూసి వైస్సార్సీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అన్నారు,నియోజకవర్గ ఇంచార్జ్ సత్య ప్రభ మాట్లాడుతూ తన భర్త వరుపుల రాజా మరణం తీవ్రంగా మనసు ను బాధించినా నియోజకవర్గ ప్రజల ఆశలు, రాజా గారి ఆశయాలు కోసం మీ ముందుకు వచ్చాను అన్నారు,కష్ట కాలంలో అండగా ఉన్న అందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు,వచ్చే ఎన్నికల్లో దివంగత నేత వరుపుల రాజా ఆశీస్సులు తో టీడీపీ జెండా ఎగర వేస్తామని దానికి నియోజకవర్గ ప్రజలు అందరి సహకారం కావాలి కోరారు,.వరకూ బయటకు రాకూడదనుకున్నా కానీ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రజలను దూరంగా ఉండలేక అంతటి బాధను దిగమింగుకొని మీ మధ్యకు వచ్చానని.. తనను మీ తోబుట్టువుగా అనుకొని సహకరించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రాజా అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని, ఈసారి ఆయన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అత్యధిక మెజార్టీతో రాజానే గెలిపించాననుకొని తనకు పట్టం కట్టాలని కోరారు. నియోజవవర్గంలోని ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని, పనిచేసిన ప్రతీ కార్యకర్తను, నాయకులను పేరు పేరుగా గుర్తించుకుంటానని హామీ ఇచ్చారు. సత్యప్రభ మాట్లాడుతున్నంతసేపూ రాజా అమర్ రహే.సత్యప్రభ నాయకత్వం వర్ధిల్లాలి, అధికారంలోకి వచ్చేది టిడిపినే అనే వాఖ్యాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ పెద్ద సంఖ్య లో టీడీపీ శ్రేణులు లతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు….


