మేడారం జాతర పనుల రికార్డులు అప్పగించండి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 16 (అఖండ భూమి న్యూస్);
సొంత పార్టీ లోనే మంత్రి కొండా సురేఖకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి…తన ఓఎస్డీ తొలగింపు,అతనిని అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ లోని సురేఖ నివాసానికి మఫ్టీ లో వెళ్లడం..సురేఖ కూతురు సుస్మిత వారిని అడ్డుకోవడం,సీఎం రేవంత్ రెడ్డి తో సహా పలువురి పై కొండా సుస్మిత ఆరోపణలు చేయడం,రాత్రంతా హై డ్రామా నెలకొనడం ఇలా ఉంటే సర్కార్ మంత్రి కొండా సురేఖకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది… మేడారం మహజాతర అభివృద్ధి పనుల టెండర్ల వివాదం నేపథ్యంలో వాటికి సంబంధించిన పైల్స్ ఆర్ అండ్ బి కి అప్పగించాలని సర్కార్ దేవాదాయశాఖ అధికారులను తాజాగా ఆదేశించినట్లు తెలుస్తుంది…ఆర్ అండ్ బీ కి మేడారం జాతర పనులు.. రికార్డులు అప్పగించాలని మంత్రి కొండా సురేఖకి చెందిన దేవాదాయశాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తుంది…
మేడారం జాతర పనులను రోడ్లు-భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం…. ఇది ఇలా ఉండగా వివిధ వివాదాల నేపధ్యంలో మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకు రానున్నారు…
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


