ఆప్తల్మక్ కు పదవీ విరమణ సన్మానం*…

*ఆప్తల్మక్ కు పదవీ విరమణ సన్మానం*…

*కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 16 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలో కేంద్రంలో జిల్లా ఆప్తాల్మక్ అధికారిగా 39 సంవత్సరాలు సేవలు అందించి, పదవీ విరమణ పొందిన సనేబోయిన లింబాద్రి ని ఈ రోజు కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 39 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారిగా ఎంతో మంది పేదలకు కంటికి సంబంధించిన చికిత్సలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో తక్కువ ఫీజుతో పేదవారికి కంటి పరీక్షలు, ఆపరేషన్లను నిర్వహించి ఆదర్శంగా సనబోయిన లింభాద్రి నిలవడం జరిగిందని,భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను పేద ప్రజల కోసం నిర్వహించాలని,వీరి సహకారంతో భవిష్యత్తులో కంటి పరీక్షల శిబిరాలను,ఉచిత ఆపరేషన్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!