ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, మరియు డిగ్రీ కళాశాలలో 2023-2024 కు విద్యా సంవత్సరానికి ప్రవేశంలకు ప్రవేశ పరీక్ష.
ఓరకల్లు రూరల్ (అఖండ భూమి) : మే 16 ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశములకు ప్రవేశ పరీక్ష 20:05:2023 న జరుగును. 5, 6, 7, 8 తరగతులకు ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు మరియు కళాశాలలకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:00 గంటల వరకు కర్నూల్, నంద్యాల జిల్లా కేంద్రములలో నిర్వహించబడునని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు) కాల్వబుగ్గ ప్రిన్సిపాల్ మరియు పరీక్షల నిర్వహణకు నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ S.మాలి బాష తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల హాల్ టికెట్లను https://aprs.apcfss.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొనవలెను. హాల్ టికెట్లు 15:5:2023 నుండి అభ్యర్థులు తమ క్యాండిడేట్ ఐడి మరియు పుట్టిన తేదీ ద్వారా డౌన్లోడ్ చేసుకోనవచ్చును. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకొనవలెను. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షకు అనుమతించబడరు. అభ్యర్థులు బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మరియు HB పెన్సిల్ తెచ్చుకోవాలని తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచెస్ అనుమతించబడవని నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ S. మాలి బాష తెలిపారు.
ఇట్లు
ప్రిన్సిపాల్,
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు), కాల్వబుగ్గ మరియు నంద్యాల జిల్లా కోఆర్డినేటర్…



