జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముఖ్యమంత్రి పదవికి ప్రతిష్టాత్మకం….

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముఖ్యమంత్రి పదవికి ప్రతిష్టాత్మకం….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 8. (అఖండ భూమి న్యూస్);

 

(అఖండభూమి న్యూస్):

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ప్రతిష్టాత్మకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓడిపోతే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపయోగ జరుగుతుందని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.

పోరా హోరీగా జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోరకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతూ తనకు రాష్ట్రంలో ప్రజాబలం తగ్గలేదని నిరూపించుకునే అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి పదవిని మరింతకాలం కాపాడుకోవాలన్న, మంత్రులను తన అదుపులో పెట్టుకోవాలన్న, తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం అధికంగా ఉంది. అటు బిఆర్ఎస్ లో గత కొంతకాలంగా మొక్కలు బయటపడుతున్న నేపథ్యంలో పార్టీలో పదవి పంపకాలలో కేసీఆర్ కుటుంబం మధ్యన వచ్చిన విభేదాలు సమస్యపై కేటీఆర్ బిఆర్ఎస్ భవిష్యత్తు నాయకుడు అని నిరూపించుకోవాలన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఊపై ఎన్నిక విజయం బూస్టు లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కు ఉపఎన్నిక చావు రేవో ఉన్నట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ పార్టీ గెలిచినా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో సంస్థగతంగా మార్పులు తప్పవు అని స్పష్టంగా కనిపిస్తోంది. అరాచకానికి పరాకాష్టగా జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారం జరుగుతుంది. అభ్యర్థుల వ్యక్తిగత జీవితాల నుండి మొదలై రాజకీయ పార్టీల విమర్శల హద్దులు దాటి, ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు సైతం వాడుతున్న పదాలు సిగ్గుచేటు. ఈ చర్చ ప్రక్రియ లేదా దిగజారుడుతనాన్ని ఎవరు మొదలుపెట్టిన హుందాతనంగా వ్యవహరించాల్సిన అధికార పార్టీల నాయకులు కూడా అదే దారిలో నడవడం బాధాకరం. దోచుకోవడం, దాచుకోవడం అనే లక్ష్యంతో పని చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజలకు కిక్కు పంచుతున్నారు తప్ప అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. రాజకీయాలంటేనే నూతన తరాలకు ఓ కే భావన ఏర్పడుతుంది. గెలవడం కొరకు మనుషులుగా దిగజారుద్దని మన తరఫున సూచిద్దాం….

Akhand Bhoomi News

error: Content is protected !!