9 వామపక్ష పార్టీల విలీనం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 8 (అఖండ భూమి న్యూస్);
నేపాల్ లో 9 వామపక్ష పార్టీలు విలీనమై నూతన పార్టీని ప్రకటించాయి. సిపిఎన్ (మావోయిస్టు సెంటర్), సిపిఎన్ (యూనిఫైడ్ సోషలిస్టు) సహా ఏడు పార్టీలు నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఈ విలీన ప్రకటన చేశాయి. నేపాల్ కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడుతున్నట్లు తెలిపాయి. మార్చి 5వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలవడడం గమనార్వహం. మిగిలిన పట్టణముందు తొమ్మిది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఐదు కోణాల నక్షత్రాన్ని ఎన్నికల గుర్తుగా స్వీకరిస్తున్నట్లు నూతనంగా ఏర్పాటైన నేపాలి కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. సిపిఎన్ (మావోయిస్టు సెంటర్) అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ ప్రచండ నూతన పార్టీకి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. (యూనిఫైడ్ సోషలిస్టు) అధినేత మాధవ్ కుమార్ నేపాల్ సహా సమన్వయకర్తగా పనిచేస్తారు. చాలా మంది చంపే అక్కడ మార్క్సిజం, లేని నిజం సైదాంతిక మార్గదర్శకంగా తీసుకుంటున్నట్లు బహిరంగ సభలో నేతలు ప్రకటించారు. రానున్న ఆరు నెలల కాలంలో జాతీయ మహాసభలను నిర్వహించి, పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని తెలిపారు. మావోయిస్టు సెంటర్ యూనిఫాడ్ సోషలిస్టు పార్టీలతో పాటు నేపాల్ సమాజవాది, సీసీఎన్ (సోషలిస్టు), జన సహజవాది పార్టీ నేపాల్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ, సిసిఎన్ (మావోయిస్టు సోషలిస్ట్), సిపిఎన్ సమబాది, దేశభక్తా సమాజ వాది మార్చా పార్టీలు ఈ విలీన ప్రకటన చేశాయి. ఈ నిర్ణయం ద్వారా కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఐక్యం అయ్యేందుకు దోహదపడుతుందని పలువురు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు….


