*మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు 16 వరకు చెల్లించకపోతే 17 నుండి వంట బంద్..!

*సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్..
*జిల్లా మహాసభలో నూతన కమిటీ ఎన్నిక..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 8 (అఖండ భూమి న్యూస్);
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా మహాసభ ఈరోజు పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
నీ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న రెండు కోట్ల 28 లక్షల బిల్లులు వెంటనే చెల్లించాలని గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల 5వ తేదీ లోపు వంట బిల్లులు వేతనాలు చెల్లించాలని కార్మికులందరికీ ఇన్సూరెన్స్ పిఎఫ్ ఈఎస్ఐ యూనిఫారం గుర్తింపు కార్డులో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంటే వాటిని చెల్లించకుండా ఎమ్మెల్యే గారు హెడ్మాస్టర్లు టీచర్లు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టమని ఒత్తిడి చేయడం సరికాదన్నారు ఇప్పటికే అప్పుల పాలైనటువంటి కార్మికులకు మెనూ అమలు చేయడం సాధ్యం కాదని తెలియజేశారు. మధ్యాహ్న భోజన వంట కార్మికుల్లో మెజార్టీ కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పేద కిందిస్థాయి తరగతి ప్రజలు వాళ్ళు ఈరోజు ఈ అప్పుల బాధలు భరించలేక ఇంట్లో ఉన్న సామాన్లు తాళిబొట్లు తాకట్టు పెట్టి బతుకుతెరువు కోసం ఈరోజు వంట కార్మికులుగా కొనసాగుతున్నారు కాబట్టి అధికారులైనా ఎమ్మెల్యే గారైన మానవత దృక్పథంతోని వాళ్ళ బిల్లులు ఇచ్చేందుకు కృషి చేయాలని అప్పటివరకు ఒత్తిడి చేసి వాళ్లను మానసిక వేదన గురిచేసి ఇబ్బందులకు నెట్టకూడదని కోరారు
ఈ కార్యక్రమంలో ముదాం అరుణ్ రాజనర్సు మోహన్ దశరథ్ కృష్ణ మరియు వంట కార్మికులు పాల్గొన్నారు
*మధ్యాహ్న భోజన కార్మిక సంఘం( సి ఐ టి యు)జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా సరస్వతి కార్యదర్శిగా వెంకటేష్ కోశాధికారిగా వాణి ఉపాధ్యక్షులుగా దుర్గయ్య రాజమణి ప్రమీల సహాయ కార్యదర్శులుగా పరశురాములు సత్తయ్య లావణ్య రజిత ప్రచార కార్యదర్శిగా ఆంజనేయులు
మొత్తం 23 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు.


