అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత..!

*అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత..!

*• రిపైర్ షెడ్ లోని కారును కామారెడ్డి లో దొంగతనాలకు పాల్పడి అపహరించిన నిందితుల అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు..

*• నిందితులు పోలీస్ ల నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు..

*జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐ.పి.యస్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 8 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో పాత ఎన్హెచ్ ఎన్ హెచ్ -7 రోడ్డు పక్క ఉన్న ఆటో ఎలక్ట్రికల్ షాపు (రేకుల షెడ్డు) లో గుర్తు తెలియని వ్యక్తులు రేకులను తొలగించి షెడ్ లోపలకి చొరబడి షెడ్డు నుండి కారు, వెహికిల్ స్కాన్నర్స్, బ్యాటరీలు, ఏసి ప్యానెల్ , సీసీటీవీ , డిస్క్ లను దొంగిలించినారని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారoభిచడం జరిగింది.

ఈ కేసు , ఇటీవల దేవునిపల్లి పోలీసు స్టేషన్ , కామారెడ్డి పట్టణ పి ఎస్ ల పరిదిలో జరిగిన కొన్ని దొంగతనాల నేరస్తులను పట్టుకోవడానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ యం రాజేశ్ చంద్ర ఐ‌పి‌ఎస్ ఆదేశాలమేరకు కామారెడ్డి ఎ ఎస్పి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో 1)కామారెడ్డి రూరల్ సిఐ రామన్, 2) సిసిఎస్ సిఐ శ్రీనివాస్, 3) దేవునిపల్లి ఎస్ఐలు రంజిత్ , భువనేశ్వర్, 4) సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ లలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సి సి టీవీ కేమరాల ద్వారా , ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా శనివారం గుర్తించారు. నర్సన్నపల్లి కమాన్ దగ్గర మరలా నేరం చేద్దామని అనుమనస్పదముగా తిరుగుతుండగా నిందితులను చాకచక్యంగా పట్టుకొని విచారించగ వారు మన జిల్లాలోని దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్ , భిక్కనూర్ పి‌ఎస్ పరిధిలో నిందితులు చేసిన 15 దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది. నిజామాబాద్ లోని రెంజల్, నిర్మల్ జిల్లాలోని బాసర పోలీస్ స్టేషన్ ల పరిదిలో నేరాలు చేసిన విషయాలు బయటపడ్డ వారిని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరుపరచుతున్నట్లు తెలిపారు.

నిందితుల వివరాలు:

ఏ1) షేక్ రఫీక్ ,

ఏ2) షేక్ ఖాదర్ ,

ఏ3) షేక్ ఖయ్యుమ్ ,

4) బండారి అశోక్ ,

ఏ5) షేక్ అజ్జు ,

స్వాధీనపు వివరాలు:

ఒక కారు, 3 బైక్ లు, 2 స్పానర్ లు, 3 ఇనుప రాడ్ లు, ఒక సుత్తె, స్క్రూ డ్రైవర్ టైప్ వెపన్, డీజిల్ క్యాన్, 1 వాహన డయగ్నస్టిక్ స్కానర్, 4 మొబైల్ ఫోన్లు

ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించడంలో కామారెడ్డి రూరల్ సి.ఐ . రామన్, సి.సి.ఎస్ సి.ఐ శ్రీనివాస్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సైలు రంజిత్ మరియు భువనేశ్వర్, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్, ప్రవీన్ ఎస్సై (పి పి బి), ఐ టి సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సి.సి.ఎస్ సిబ్బంది కిషన్, రాజవీర్ (హెచ్‌సీ), గణపతి, లక్ష్మీకాంత్, రవి, స్వామి, శ్రీనివాస్, మైసయ్య, శ్రావణ్ కుమార్, రాజేంద్ర కుమార్, అలాగే దేవునిపల్లి పి‌ఎస్ హెచ్‌సీ కృష్ణారెడ్డి, పీసీలు రవికిరణ్, రాము లు చూపిన సమన్వయం, చురుకుదనం నిబద్ధతను జిల్లా ఎస్పీ అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!