అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి

జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో గురువారం రాత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణాలు బలైపోయింది. ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల తెగిపోయిన రోడ్డు పక్కన గుంతలను తాత్కలికంగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుని మృతి చెందాడాని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తాత్కారికా మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలను మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేయడంతో రోడ్డు పక్కన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజంపేట మండల కేంద్రానికి చెందిన పిట్ల పెంటయ్య (62) అనే వ్యక్తి బోరుగడ్డ ప్రాంతంలో తన వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో ప్రాథమిక ఆరోగ్య సమీపంలో రోడ్డు పక్కన గుంతలో సైకిల్ పై నుండి పడి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు కుటుంభ సభ్యుల సమాచారం ఇవ్వడంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు కుటుంబీకులు బంధువులు తెలిపారు. పిట్ల పెంటయ్య అంటే పేరు తెలియని వారు ఎవరూ ఉండరు చుట్టుపక్కల గ్రామాలకు సుపరిచితమైన సీనియర్ డ్రైవర్ ఆయన మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఏది ఏమైనా అధికారుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపించారు. రోడ్డు మరమ్మతులు చేసి ఉంటే తన భర్త బ్రతికేవాడని అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని కుటుంబానికి ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


