రేషన్ బియ్యం ప్రైవేటు వాహనాలలో తరలింపు…
చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు..
సిపిఐ మండల కార్యదర్శి టి కృష్ణ
వెల్దుర్తి నవంబర్ 27 (అఖండ భూమి వెబ్ న్యూస్) : మండల కేంద్రమైన వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలకు చెందిన సివిల్ సప్లై నుండి ప్రభుత్వం నిర్ణయించిన లారీలో బియ్యం తరలించకుండా ఇష్టరాజ్యంగా ట్రాక్టర్లతో తరలిస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి టి కృష్ణ ఆరోపించారు. గురువారం స్థానిక సివిల్ సప్లై అధికారులతో మాట్లాడారు. ప్రైవేట్ వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని తరలిస్తే బ్లాక్ మార్కెట్కు తరలించే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా గతంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలకు చెందిన డీలర్లు బ్లాక్ మార్కెట్కు డైరెక్ట్ గా తరలించిన దాఖలాలు ఉన్నట్లు సమాచారం. సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన వాహనాల ద్వారానే తరలించాలని అన్నారు. ప్రైవేట్ వాహనాల ద్వారా తరలిస్తే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



