అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
6వ వార్డు అభ్యర్థి అబ్రబోయిన రాజేందర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
6 వార్డు మెంబర్ గా అవకాశం ఇవ్వాలని దోమకొండ గ్రామపంచాయతీ 6వ వార్డు నెంబర్ అభ్యర్థిగా అబ్రబోయిన రాజేందర్ ను గెలిపించాలని అన్నారు. శనివారం దోమకొండ గ్రామపంచాయతీ 6 వ వార్డ్ నెంబర్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఈ సందర్భంగా మాట్లాడారు. శుక్రవారం ఒక నామినేషన్ దాఖలు చేయగా శనివారం మరో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఆరో వార్డులో దోమకొండ గ్రామం పెరుగుతున్న జనాభా ప్రకారం ఓటర్లు చేర్పులు మార్పులు జరిగినట్లు తెలిపారు. ఆరో వార్డును మరింత అభివృద్ధి చేయడానికి వార్డు మెంబర్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థతోపాటు, రోడ్లు, రోడ్ల పరిశుభ్రం, వీధిలైట్లు, అన్ని సౌకర్యాలతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 6 వార్డు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి వార్డు మెంబర్ గా ఒకసారి అవకాశం ఇచ్చి విజయం సాధించే విధంగా సహకరించాలని కోరారు. తనకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన మద్దతు దారులతోపాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


