*ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్ ప్రక్రియ…
*రెండు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్..
*వృద్ధ ఓటరును పలకరించిన జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్);
2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధ ఓటర్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడారు
ఈ సందర్భంగా వృద్ధురాలితో మాట్లాడిన కలెక్టర్ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలని, ముఖ్యంగా యువతతో పాటు వృద్ధులు కూడా చురుకుగా ఎన్నికలలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని అన్నారు.
అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ కేంద్రాలు ఎల్లారెడ్డి నియోజక వర్గం లోని లక్ష్మాపూర్ , లింగం పేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి కౌంటింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.
ఇందులో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆర్డీవో పార్థ నరసింహా రెడ్డి, పోలింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


