ఏసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలు…

ఏసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలు…

క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చిలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 25 (అఖండ భూమి న్యూస్);

యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలని,అవి ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విలువలను బోధిస్తాయని *తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ అన్నారు కామారెడ్డిలో ముత్యంపేట్ ,కామారెడ్డి, కాకతీయ నగర్,చర్చి లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఇందుప్రియ గారు మాట్లాడుతూ,ప్రేమ,క్షమ, సేవ, త్యాగం వంటి యేసుక్రీస్తు బోధనలు సమాజంలో శాంతి,ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.కుల,మత, వర్గ భేదాలు లేకుండా అందరూ మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ మానవాళికి ఆశ,ఆనందం, పరస్పర గౌరవం అనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు. అంతకుముందు చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో, పాల్గొని, ప్రజల సుఖసంతోషాలు,రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్లు యేసుక్రీస్తు జన్మ మహత్యాన్ని, ఆయన బోధనల ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్, శంకర్ రావు, చాట్ల వంశీ, సలీం,గడ్డమీది మహేష్, రంగ రమేష్, నర్సుల్ల మహేష్, బండారి శ్రీకాంత్, పండు శ్రీకాంత్, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!