*యేసుక్రీస్తు చూపిన మార్గం మానవాళికి అనుసరణీయం* 
– రెవరెండ్ శ్రీనివాస్ సాప
*సంగమేశ్వర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లోని సంగమేశ్వర గ్రామంలో గురువారం గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ శ్రీనివాస్ సాప మాట్లాడుతూ యేసు క్రీస్తు పుట్టిన రోజును ప్రపంచ ప్రజలు జరుపుకునే ప్రత్యేకమైన పండుగని, యేసు క్రీస్తు పుట్టిన రోజు ప్రజలందరికీ సంతోషం కలగజేసే ప్రపంచ పండగ అని అన్నారు. యేసు క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఆయన అన్నారు . ఆయన బోధలు ఆయన చూపిన మార్గం మానవాళి నీ మనుషులుగా, మానవతా విలువలు కలిగి మనుషులంతా బ్రతకాలని తెలియజేసే మార్గమని తెలిపారు. మానవ విలువలు నేర్పిన ఆయన బోధనలు అనుసరిస్తే మనిషిని మనిషిగా ప్రేమించే గుణం అలవాటు ఉందన్నారు. మానవతా విలువలు నేర్పిన, మనుషులను ప్రేమించిన మానవతా విలువలు కలిగిన మహనీయుడని ఆయనను కీర్తనలు పాడి కొనియాడారు. రక్షించే ప్రభువు అని ఆరాధించారు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బోధ చేశారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాప పవిత్ర, గాయత్రి జ్ఞాన్ కుమార్ , పుట్ట కమల మోహన్ రెడ్డి బట్ట మరియమ్మ రామచంద్రం, సడుగు రేబికా రాజు, ప్రసాద్, రాజయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని అంచనూర్, గొడ్డుముకుల, సీతారాంపల్లి ముత్యంపేట్, అంబర్పేట్, చింతామణి పల్లి, గ్రామాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


