దోమకొండ జీపీ పాలకవర్గానికి ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సన్మానం…

దోమకొండ జీపీ పాలకవర్గానికి ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సన్మానం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ ఆలయంలో బుధవారం దోమకొండ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి దోమకొండ మండల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించారు. దోమకొండ సర్పంచ్ ఐరన్ నరసయ్యతో పాటు ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, 16 మంది వార్డు సభ్యులకు శాలువలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దోమకొండ గ్రామాన్ని పంచాయతీ పాలకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి తల వంతు తోడ్పాటును అందించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని అతి పెద్ద మేజర్ పంచాయతీ అయినా దోమకొండ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఉద్యోగులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ఆర్టిసి కండక్టర్లు డ్రైవర్ సంఘం ప్రతినిధులు పనస అంజయ్య, శివ గారి బాల్ రెడ్డి, నల్లపు రాజేందర్, శ్రీరామ్ రమేష్, నల్లపు రాజేందర్, గోపాల్ రెడ్డి, బొమ్మెర నవీన్ కుమార్, బైబి కిషన్, జై నర్సింలు, భూమయ్య, నర్సింగరావు, బాలయ్య, ముత్యం, కర్రోళ్ల శ్యాం కుమార్, అబ్రబోయిన బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!