అంబర్ పేటలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరీ పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్, ఉప సర్పంచ్ రంగోలి సత్య గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే మొదటి మహిళా గురువు ఆమె త్యాగాలు పై భారత దేశ చరిత్రలో మహిళ ఉద్యమరాలుగా బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె అడుగుజాడల్లో భావికారాలు మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ , కరోబార్ కిషన్ రావు, నిమ్మ లావణ్య, రంగు ఈశ్వర్ గౌడ్, నీల దేవరాజు, రంగోలి సత్య గౌడ్, నిఖిత, ఫిరంగి అశోక్, చంద్రారెడ్డి, అమరేందర్, పూసపురం కవిత, దేవునిపల్లి పూజిత, నిమ్మ దేవవ్వ, పిట్ల స్వామి గ్రామస్తులు, జిపి సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


