మటన్ ప్రియులు ఈ పదార్థాలు తింటే డేంజర్ ఫుడ్ పాయిజన్ తప్పదు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);
మటన్ ప్రియులు .ఈ వార్త మీకోసమే, ఇష్టం తో మటన్ తిన్న తర్వాత కింద చెప్పబోయే పదార్థాలు తింటే మీ పని అయిపోయినట్లే.. ప్రాణాలకే డేంజర్.అంటున్నారునిపుణులు.
పాలు – పాల ఉత్పత్తులు: మటన్ లేదా చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకోకూడదు. మాంసాహారం, పాల ఉత్పత్తులు రెండూ విరుద్ధ స్వభావం కలవి. ఇవి కలిసి జీర్ణ ప్రక్రియను నెమ్మదింపజేసి, ఫుడ్ పాయిజనింగ్ లేదా చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి రసం తీసుకోవడం ఉత్తమం.
తేనెతో ప్రమాదం: మటన్ శరీరంలో వేడిని కలిగిస్తుంది. తేనె కూడా ఉష్ణ గుణం కలిగినదే. ఈ రెండింటి కలయిక వల్ల శరీరంలో వేడి విపరీతంగా పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మటన్ తిన్న వెంటనే తేనెకు దూరంగా ఉండాలి.
భోజనం తర్వాత టీ: చాలా మందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మటన్ తిన్న తర్వాత టీ తాగడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట కలిగే ప్రమాదం ఉంది.
పండ్ల విషయంలో: ముఖ్యంగా అరటిపండు వంటి త్వరగా జీర్ణమయ్యే పండ్లను మటన్ తిన్న వెంటనే తినకూడదు. ఇది కడుపులో గ్యాస్ సమస్యలను సృష్టిస్తుంది. అలాగే అధిక చక్కెర లేదా అధిక కారం ఉన్న పదార్థాలు తీసుకుంటే నీరసంగా అనిపిస్తుంది.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం: మటన్ తిన్న తర్వాత నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 15-20 నిమిషాలు నడవడం మంచిది. మటన్‌ను వీలైనంత వరకు మధ్యాహ్న భోజనంలోనే తీసుకోవాలి. ఒకవేళ రాత్రి పూట తింటే పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే తినాలి. కడుపు నిండా మాంసాన్నే కాకుండా కొంత భాగం కూరగాయలకు, మరికొంత నీటికి ఖాళీ ఉంచడం ఆరోగ్యకరం. అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


