అవినీతి రహిత కామారెడ్డి మున్సిపాలిటీ పాలన కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి…

అవినీతి రహిత కామారెడ్డి మున్సిపాలిటీ పాలన కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11 (అఖండ భూమి న్యూస్);

 

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ బీజేపీ కౌన్సిలర్ లు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా 34 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సుజిత భరత్ మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి పాలన అంతం కోసం వెంకట రమణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి అవకాశం ఇవ్వండి. గత బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో అవినీతి పెచ్చుమీరింది. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జాలకు గురయ్యాయి. ఎమ్మెల్యే కాకముందు చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా భూ కబ్జాలపై 5 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇంకా దరఖాస్తులు రాని కబ్జాలు అనేకం ఉన్నాయి. గతంలో 10-20 కోట్ల అభివృద్ధి చేసి 100 కోట్ల భూముల కబ్జాలు చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడని అవినీతి జరగడం లేదు.. భూ కబ్జాలు తగ్గాయి. ప్రజలు గుండెమీద చేయి వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఒక్క కౌన్సిలర్ కూడా అవినీతికి పాల్పడలేదు. అవినీతి ఆలోచన ఉన్నవాళ్లు బీజేపీలో ఎక్కువ కాలం కొనసాగలేరు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను సృష్టిస్తోంది. వాటి ద్వారా మున్సిపల్ కైవసం చేసుకునేందుకు కుట్ర చేస్తోంది. ఇతర పార్టీల నుంచి డబ్బు మద్యం ఆశచూపి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తారు. గెలిచాక ప్రజలను దోచుకుని అడ్డదారిలో సంపాదిస్తారు. బీజేపీ నుంచి సాదాసీదా వ్యక్తులే పోటీలో ఉంటున్నారు. భూ కబ్జాలు కావాలా..? అవినీతి రహిత అభివృద్ధి కావాలా..? పట్టణ ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు. కామారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీకి అవకాశం ఇవ్వండి.

 

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ , పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ ఓటరు జాబితా తప్పులతడకగా మారిందని ధర్నా చేసాం. షెటర్లు, షాపింగ్ మాల్స్, లాడ్జీలపై వందల ఓట్లు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఇదే కుటిల ప్రయత్నాలు చేసింది. కమిషనర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఓటర్ జాబితాలో తప్పులపై అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రేపు మున్సిపల్ ముట్టడి చేపడుతున్నాం. ప్రతి బీజేపీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!