*భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ*
*ఉత్తేజితమవుతాయి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
*సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో* *తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.. అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.
*పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి,* *భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.. భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది.
*దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
*చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, అని భగవంతుని కృపకు పాత్రులవుతాం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


