సమ్మె నోటీస్ పై అధికారులకు మెమోరాండం…

సమ్మె నోటీస్ పై అధికారులకు మెమోరాండం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);

గత 4 నెలలుగా వేతనాల కోసం ఎదురు చూసి చూసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజల ఆరోగ్యం కోసం ఎన్ హెచ్ఎం ఉద్యోగులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న , దసరా నుండి సంక్రాంతి వరకు జీతం లేకపోవడం బాధాకరమని ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తులు తెలిపారు. చాలీచాలని జీతాలతో ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు పల్లెల వరకు, సామాన్య ప్రజల వరకు చేరవేసేది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులే అన్నారు. పెండింగ్లో ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14 నుండి 21 వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వైద్యారోగ్య సేవలను కొనసాగించ కుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ విషయమై కామారెడ్డి డిఎంహెచ్ఓ , బాన్సువాడ ఆర్ఎంవో డాక్టర్ సుజాత లకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 21 వరకు వేతనాలు పడకపోతే 22 నుండి సమ్మెకు దిగుతామని తెలిపారు. ఎన్ హెచ్ ఎం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఎం ల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. వేతనాల కోసం ఇబ్బంది పెట్టకుండా ప్రతినెల 5వ తేదీ లోపు ఎన్ హెచ్ ఎం కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు వేయాలని ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఎన్హెచ్ఎం నాయకులు తాళ్ల పల్లి సుమన్, వెంకటరమణ, రాజు, శ్రీకాంత్, పద్మజ, అశ్విని, సుభాషిని, శోభ, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!