కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిసి రోడ్ల పనులను ప్రారంభించిన మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని 20,21,22,23 వార్డ్ బొంబాయి కాలనీ, రాజీవ్ కాలనీ లో నూతనంగా సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మంగళవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కామారెడ్డి మున్సిపాలిటీనీ తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన , కార్పొరేషన్ కు తక్కువ కాకుండా అభివృద్ధిలో పరుగులు తియ్యిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మరింత అభివృద్ధి చెందాలంటే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు కట్టబెట్టి కామారెడ్డి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, సత్యం, యూనుస్, ప్రసాద్, వార్డ్ ప్రజలు, మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


