*వీధి కుక్కల దాడిలో ఎవరైనా గాయపడితే వాటికి తిండిపెట్టిన వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచన
రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాలని హెచ్చరిక
చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు బాధ్యత వహించాల్సిందే.
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడిచేసి గాయపరిస్తే.. వాటికి తిండి పెడుతున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది.
వీధి కుక్కల విషయంలో తమ ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గాయపడ్డ వారికి పరిహారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని స్పష్టం చేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు తాము నిర్దేశించిన పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ హెచ్చరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


